Site icon NTV Telugu

Moto g86 Power 5G: 50MP OIS కెమెరా, 6720mAh బ్యాటరీ లాంటి ప్రీమియం ఫీచర్లతో అలరించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మోటోరోలా..!

Moto G86 Power 5g

Moto G86 Power 5g

Moto g86 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా (Motorola) తాజాగా తన ‘g’ సిరీస్‌లో మరో ఫోన్‌ను భారత్‌ లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన మోటో g86 పవర్ 5G ను భారత మార్కెట్లో జూలై 30న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మోటో g86 పవర్ 5G సంబంధించిన వివరాలపై ఒక లుక్ వేద్దామా..

డిజైన్ అండ్ డిస్ప్లే:
ఈ మోటో g86 పవర్ 5Gలో 6.67 అంగుళాల 1.5K 10-బిట్ కర్వ్డ్ pOLED డిస్ప్లే (2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్) ఇవ్వబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వంటి హైఎండ్ ఫీచర్లతో వస్తోంది. ముఖ్యంగా క్వాలిటీ డిస్ప్లే అనుభూతిని అందించడంలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది.

Skeleton : హత్యా? ఆత్మహత్యా? కుక్కలగుట్టలో మహిళ అస్థిపంజరం మిస్టరీ

ప్రాసెసర్ అండ్ స్టోరేజ్:
మోటో g86 పవర్ 5G భారత వెర్షన్‌ ప్రత్యేకంగా మీడియాటెక్ డిమెంసిటీ 7400 (4nm) ప్రాసెసర్‌తో లభించనుంది. ఇది గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న డిమెంసిటీ 7300కి మించిన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ లో 8GB LPDDR4x RAM, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. అలాగే దీనిని 1TB వరకు మైక్రో SD కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు.

కెమెరా సెటప్:
రాబోయే కొత్త మొబైల్లో ప్రధానంగా 50MP సోనీ LYT-600 సెన్సార్ (f/1.8 అప్రెచర్, OIS) తోపాటు 8MP 118 డిగ్రీల అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇది మాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్ కెమెరా (f/2.2 అప్రెచర్‌తో) లాంచ్ కానుంది.

HHVM : అఫీషియల్.. వీరమల్లు ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్..

ఇతర ఫీచర్లు:
త్వరలో లాంచ్ కాబోయే ఫోన్‌లో ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్రోఫోన్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది IP68/IP69 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్ ద్వారా ధూళి, నీటి నుండి రక్షణ పొందుతుంది.

బ్యాటరీ అండ్ కనెక్టివిటీ:
ఈ మోటో g86 పవర్ 5G ఫోన్ లో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi ac (2.4GHz + 5GHz), Bluetooth 5.4, GPS/GLONASS/Beidou, USB Type-C వంటి మంచి కనెక్టివిటీ ఎంపికలతో వస్తోంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 6720mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 33W టర్బో చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్ బౌండ్ అనే మూడు పాంటోనే రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక ఫోన్ ధర వివరాలు జూలై 30న అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version