Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్ ఏది..? ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: ప్రతి నిత్యం మొబైల్ ప్రపంచంలో అనేక మొబైల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వీటిలో మిడ్ రేంజ్ సంబంధించిన ఫోన్స్ కు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం మొబైల్ ప్రపంచంలో మిడ్ రేంజ్ లో తాజాగా విడుదలైన మోటరోలా “Edge 50 Fusion” , వివో “Y39 5G” ఫోన్లు వినియోగదారులను తేగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లూ మంచి స్పెసిఫికేషన్లతో వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు ఫోన్ల మధ్య ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. మొత్తానికి ఏ మొబైల్ బెస్ట్ ఏదో చూద్దాం.
డిస్ప్లే:
మోటోరోలా Edge 50 Fusion లో 6.7 అంగుళాల Full HD+ pOLED కర్వ్డ్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1600nits పీక్స్ బ్రైట్నెస్ లభిస్తుంది.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
వివో Y39 5G: 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్నెస్ సాధారణ స్థాయిలోనే ఉంది.
ఈ డిస్ప్లే విషయంలో మోటరోలా స్పష్టంగా కర్వ్డ్ AMOLED తో పైచేయి సాధించిందని చెప్పవచ్చు.
Read Also:Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!

ప్రాసెసర్ అండ్ పనితీరు:
Edge 50 Fusionలో Qualcomm Snapdragon 7s Gen 2 (4nm), 8GB/12GB LPDDR5 RAM, Adreno 710 GPU ఉండగా..
Vivo Y39 5Gలో MediaTek Dimensity 6100+ (6nm), 6GB/8GB LPDDR4X RAM, Mali-G57 MC2 GPUలు కలిగి ఉంది.
వీటి పనితీరు పరంగా Snapdragon 7s Gen 2 చిప్ ఉన్న మోటరోలా ఫోన్ మెరుగైనదిగా నిలుస్తుంది.

కెమెరా:
Edge 50 Fusion లో 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరా (OIS తో), 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
వివో Y39 5Gలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
వీటిని బట్టి చూస్తే ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటరోలా కెమెరా సెటప్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫీ కెమెరా విషయంలో.
Read Also:Vaibhav Suryavanshi: గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!
బ్యాటరీ, ఛార్జింగ్:
మోటోరోలా Edge 50 Fusion లో 5000mAh బ్యాటరీ, 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ లభిస్తుంది.
ఇక వివో Y39 5Gలో 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది.
వీటి తేడాను గమనిస్తే.. వివో ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఇచ్చినప్పటికీ, మోటరోలా ఛార్జింగ్ వేగం దృష్ట్యా ముందుంది.

ఇతర ఫీచర్లు:
మోటోరోలా Edge 50 Fusion లో Android 14 (stock-like UI), IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, గొరిల్లా గ్లాస్ 5, 3 OS updates + 4 ఏళ్ల సెక్యూరిటీ లభిస్తుంది.
ఇక Vivo Y39 5Gలో Android 14 (Funtouch OS), IP54 రేటింగ్, ప్లాస్టిక్ బిల్డ్, OTA updates only (not long-term commitment)లు లభిస్తాయి.
వీటిని బట్టి సాఫ్ట్‌వేర్, బిల్డ్ క్వాలిటీ, లాంగ్-టెర్మ్ సపోర్ట్ ఇలా అన్నిటిలో మోటోరోలా ముందంజలో ఉంది.

ధర:
మోటోరోలా Edge 50 Fusion (8GB + 128GB) వేరియంట్ రూ. 19,498 నుండి మొదలు కానుండగా..
Vivo Y39 5G (8GB + 128GB) వేరియంట్ రూ. 16,999 నుండి మొదలు అవనున్నాయి.
ఇక ధర పరంగా వివో కాస్త తక్కువ ధరలో లభించినప్పటికీ, స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం మోటరోలా మంచి విలువ ఇస్తోంది.
మొత్తంగా చూసుకుంటే, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అన్ని స్పెసిఫికేషన్స్ లో మెరుగ్గా కనిపిస్తుంది. అయితే, వివో Y39 5G తక్కువ బడ్జెట్‌లో ఒక సింపుల్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ కావాలనుకునేవారికి సరైన ఎంపిక అవుతుంది. మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కానీ పనితీరు, ప్రీమియం ఫీచర్ల కోసం వెతుకుతున్నట్లైతే మాత్రం మోటరోలా Edge 50 Fusion ను ఎటువంటి ఆలోచన లేకుండా కొనవచ్చు.
తాజావార్తలు
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!