NTV Telugu Site icon

Moto G Stylus 5G: మోటరోలా నుంచి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్.. ఫీచర్లు ఇవే!

Moto G Stylus 5g

Moto G Stylus 5g

Moto G Stylus 5G: మోటరోలా తమ G సిరీస్‌లో భాగంగా కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G Stylus 5G (2025) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది వచ్చిన మోడల్‌కు అప్డేట్ గా వస్తోంది. మెరుగైన పనితీరు, అధునాతన ఫీచర్లు, స్టైలస్ సపోర్ట్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను రూపొందించారు. ఇకపోతే, ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ స్టైలస్ వుంది. దీని రెస్పాన్సివ్ నెస్ గత మోడల్‌తో పోల్చితే 6.4 రెట్లు మెరుగుగా కనిపిస్తోంది. నోట్స్ లో రాయడం, యాప్స్ నావిగేట్ చేయడం, స్కెచ్‌లు వేయడం వంటి పనుల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో “స్కెచ్ టు ఇమేజ్” లాంటి AI ఫీచర్, అలాగే “సర్కిల్ టు సెర్చ్” వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇవి వినియోగదారుల అనుభవాన్ని మరింత పెంచుతాయి.

Read Also: REDMAGIC 10 Air: గేమర్ల కోసం ప్రత్యేకంగా త్వరలో విడుదలకు సిద్ధం కానున్న రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ స్మార్ట్‌ఫోన్

ఈ ఫోన్‌కి IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ లభించాయి. దీని వల్ల ఇది కఠినమైన వాతావరణంలో కూడా బాగా పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల 10-bit pOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ను ఉపయోగించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కి బాగా సరిపోతుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ కెమెరాతో పాటు.. 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అలాగే ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీనికి 68W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. దీనిని 1TB వరకు ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 My UX తో పని చేస్తుంది. ఇన్ -డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, USB టైపు-సి లాంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also: Realme NARZO 80 Pro 5G: 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్ తో వచ్చేసిన రియల్‌మీ నార్జో 80 ప్రో

ఈ Moto G Stylus 5G (2025) ఫోన్ జిబ్రాల్టర్ సీ, సర్ఫ్ ది వెబ్ పాంటోనే కలర్ ఆప్షన్‌లలో లెదర్ ఇన్‌స్పైర్డ్ ఫినిష్ తో అందుబాటులో ఉంటుంది. దీని ధర 399.99 డాలర్స్ (అంటే సుమారు రూ.34,500)గా ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్ 17 నుండి ఆన్లైన్ లో ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.