NTV Telugu Site icon

Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు

Motion Sickness

Motion Sickness

కొంతమంది ప్రయాణం చేయడానికి భయపడుతూ ఉంటారు. మరి ఎక్కువగా కారు, బస్సులో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. కారణం ఏమిటంటే కొంతమందికి తీవ్రమైన వాంతులు, అలాగే తలనొప్పి వస్తూ ఉంటుంది ప్రయాణంలో. అందుకే ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్యలు అన్నిటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలకి చెక్ పెట్టేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలని చూసేద్దాం.

ప్రయాణం చేసే అరగంట ముందే ఆహారాన్ని తీసుకొండి. ఆహారం తిన్న వెంటనే ప్రయాణం చేయకండి. ఇలా చేసినట్లయితే వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు కొద్దిగా ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఆహారంలో మసాలా, అలాగే నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే మధ్యమధ్యలో కాఫీ, టీ లేదా సోడా తాగండి. ఇలా చేసినట్లయితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే వాంతులు అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?

సరైన చోట కూర్చోండి. కారులో ముందు సీటులో కూర్చున్నప్పటికన్నా వెనక కూర్చుంటే వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బస్సులోనూ వీలైనంత వరకు ముందు వరుసలో కూర్చోవడం మంచిది. ట్రైన్‌లో రైలు కదలే దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. కిటికీ పక్కన కూర్చుంటే మంచిది. ప్రయాణించే సమయంలో తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. కారులో ఏసీ వాడుకోవచ్చు. రైల్లో బస్సులో కిటికీ నుంచి వచ్చే గాలి మొకానికి తగిలేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మీకు తలతిరగడం, వాంతులు అయ్యే సమస్య తగ్గుతుంది.
Also Read : Health Tips: చలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం

అలాగే అల్లం మురబ్బను తీసుకెళ్ళండి, అల్లంలో వికారాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేదంటే వేడినీళ్ళల్లో అల్లం పొడిని వేసుకొని ఆ నీటిని కలుపుకుని తాగండి. ఇలా చేసినా కానీ వెంటనే ఉపశమనం లభిస్తుంది. మధ్యమధ్యలో అల్లం టీని కూడా తాగండి. ఇలా చేసినా కానీ మంచి ఫలితం లభిస్తాయి.

ఇక మరో చిట్కా ఏంటంటే నిమ్మకాయని దగ్గర పెట్టుకొని కడుపు తిప్పినట్టు అనిపించినప్పుడల్లా దీని వాసన చూడండి. అలాగే పుస్తకాలు చదవడం లాంటివి చేయకండి. ఎందుకంటే వాంతులు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దృష్టి మార్చుకోవాలి ప్రయాణంలో ఉన్నప్పుడు మాకు వాంతులు అవుతున్నాయి అనే భావన తొలగించాలి. ప్రయాణంలో ఎన్నో ప్రకృతి అందాలు, కొత్తరకం మనుషులు వారి ముఖాలు, వారి ప్రవర్తన చూస్తూ పరిసరాలను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే ప్రయాణంలో తలని అటు, ఇటు తిప్పకుండా ఏదో ఒక పాయింట్‌పై దృష్టి కేంద్ర రాయిస్తూ చూస్తే మీకు వాంతులు కావు అని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Tech Tips : మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఇలా చేయండి

అలాగే యాలకులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు యాలకులు తింటే మీకు వికారం తగ్గుతుంది. మీ నోటి రుచి మారినా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే వాంతి వచ్చే భావన తగ్గుతుంది. ప్రయాణం సమయంలో తులసి ఆకులు నమిలిన కొందరికి వాంతి భావన తగ్గే అవకాశం ఉంది. విరామం తీసుకోండి మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే మధ్యమధ్యలో కొద్దిసేపు విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే మీకు నచ్చిన మ్యూజిక్‌ వింటూ ఉండండి. ఇలా చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాంతుల భావనను తగ్గించుకోవచ్చు. అలాగే కొంతమందికి కూర్చుంటే లేదా పడుకుంటే వాంతులు తగ్గుతాయి. అలాంటి వారు కారులో గాని బస్సులో రైల్లో ప్రయాణిస్తున్నట్లయితే కొద్దిసేపు పడుకోవడానికి లేదా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంతమందికైతే నిల్చుంటే వాంతులు తగ్గుతాయి. అలాంటి వారు రైల్లో గాని, బస్సుగాని ప్రయాణం చేసినట్లయితే కొద్దిసేపు నిల్చునే ప్రయత్నం చేయండి.