Site icon NTV Telugu

Kolkata : ఛీ..ఛీ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురు తగలపెట్టబోయిన తల్లి..

Kolkata : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించిందో తల్లి. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ప్లాన్ చేసి తన పదహారేళ్ల కుమార్తెను కాల్చి చంపాలనుకుంది. ఈ కేసులో నిందితుడైన మహిళ, ఆమె ప్రియుడిని హరిదేవ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తాలోని హరిదేపూర్‌లోని మోతీలాల్ గుప్తా రోడ్ ప్రాంతంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనాలి, కౌశిక్ ఇద్దరు భార్యభర్తలు. కౌశిక్ వ్యాపార వేత్త. వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్న ప్రసూన్ మన్నా అనే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తో సోనాలికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సోనాలి కుమార్తెకు తెలిసింది. ఈ విషయమై తల్లితో పలుమార్లు గొడవ పడింది. దీంతో సోనాలి బాలికను తగులబెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో బాధితురాలు హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు సోనాలిని అరెస్ట్ చేశారు.

Read Also:West Bengal: బీజేపీ నాయకుడి మృతి.. తృణమూల్ హత్య చేసిందని ఆరోపణలు

బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తల్లి సోనాలికి వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడి సాయంతో బాలికను హత్య చేయాలని పథకం వేసింది. తాను ఇంట్లో ఉన్నప్పుడు తల్లి నిప్పంటించిందని తెలిపింది. మంటలు అంటుకోగానే వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం తల్లికి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలతో బాలిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో బాలిక పోలీసులకు తన తల్లి తన ‘ప్రియుడు’తో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఆధారాలు చూపించింది. అక్కడి నుంచి హత్యకు కుట్ర పన్నినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో నిందితురాలిని అరెస్టు చేశారు.

Read Also:Agent 2 : ఏజెంట్ దెబ్బకు అయోమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్

ఈ మహిళ ప్రేమికుడు ప్రసూన్ మన్నా (40) హుగ్లీలోని చందన్‌నగర్ నివాసి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నిందితుడు రాష్ట్ర పోలీసుశాఖ ఉద్యోగి. బాలికతో సోనాలి విడిగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే వివాహేతర సంబంధాల కారణంగా కూతురిని హత్య చేసేందుకు తల్లి పథకం పన్నిందని ఫిర్యాదు అందింది. సోనాలి, ఆమె ప్రియుడి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక హత్యకు కుట్ర పన్నినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయని, ఇప్పుడు ఆ కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version