Delhi Crime: టాయిలెట్లో జన్మించిన పసికందు.. బయటకు విసిరేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం వర్ణించలేనిదని ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన పిల్లలు ఎలా ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి క్షణం పిల్లలపై ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమను చూపిస్తుంది. ఇక తొమ్మిది నెలలు కడుపులో మోయడమే కాదు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది.
తన కడుపున పుట్టిన చిన్నారి విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయింది ఆ తల్లి. అప్పుడే పుట్టిన పసికందును టాయిలెట్ కిటీకీ నుంచి విసిరేసింది ఓ కసాయి తల్లి. ఈ అమానుష ఘటన తూర్పు ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని కొండ్లీలో గల “జై అంబే” అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది.
టాయిలెట్లో ఉండగానే యువతి పసికందుకు జన్మనిచ్చింది. పెళ్లికాకుండానే గర్భం దాల్చి, శిశువుకు జన్మనిచ్చిన యువతి.. సమాజంలో ఎవరికైనా తెలిస్తే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
TV Channels: రిషబ్ పంత్ యాక్సిడెంట్ కవరేజీ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక
అందుకే ఆ భయంతో పుట్టిన వెంటనే కిటికీ నుంచి పసికందును విసిరేసింది. ఆ పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందం ఆ ఇంటిలో రక్తపు మరకలు, నమూనాలను సేకరించింది. పోలీసులు అపార్ట్మెంట్ వాసులను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!