Site icon NTV Telugu

Delhi Crime: టాయిలెట్‌లో జన్మించిన పసికందు.. బయటకు విసిరేసిన తల్లి

Delhi Crime

Delhi Crime

Delhi Crime: ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం వర్ణించలేనిదని ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన పిల్లలు ఎలా ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి క్షణం పిల్లలపై ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమను చూపిస్తుంది. ఇక తొమ్మిది నెలలు కడుపులో మోయడమే కాదు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది.

తన కడుపున పుట్టిన చిన్నారి విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయింది ఆ తల్లి. అప్పుడే పుట్టిన పసికందును టాయిలెట్ కిటీకీ నుంచి విసిరేసింది ఓ కసాయి తల్లి. ఈ అమానుష ఘటన తూర్పు ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని కొండ్లీలో గల “జై అంబే” అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది.
టాయిలెట్‌లో ఉండగానే యువతి పసికందుకు జన్మనిచ్చింది. పెళ్లికాకుండానే గర్భం దాల్చి, శిశువుకు జన్మనిచ్చిన యువతి.. సమాజంలో ఎవరికైనా తెలిస్తే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడింది.

TV Channels: రిషబ్ పంత్ యాక్సిడెంట్ కవరేజీ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

అందుకే ఆ భయంతో పుట్టిన వెంటనే కిటికీ నుంచి పసికందును విసిరేసింది. ఆ పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందం ఆ ఇంటిలో రక్తపు మరకలు, నమూనాలను సేకరించింది. పోలీసులు అపార్ట్‌మెంట్ వాసులను ప్రశ్నించారు.

Exit mobile version