Mother Teaching Her Children on Road Side: సోషల్ మీడియా వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా మంచైనా, చెడైనా వెంటనే తెలిసిపోతుంది. వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చిరాకు తెప్పించేవి ఉంటే కొన్ని మాత్రం స్పూర్తిని నింపేవి ఉంటాయి. అటువంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ బాధ్యతకు మారు పేరు. ఎన్ని పనులలో బిజీగా ఉన్నా పిల్లలే ఆమె ప్రపంచం. నిరంతరం పిల్ల గురించే ఆలోచిస్తూ ఉంటుంది తల్లి. ఇల్లాలిగా ఇంటి పనులు చూసుకుంటూ ఉంటూనే, ఉద్యోగిగా ఆఫీసు పనులు చక్కబెడుతూనే తల్లిగా కూడా తన బాధ్యతలను ఎంతో చక్కగా నేరవేరుస్తుంది ఓ స్త్రీ. తల్లి తన బిడ్డల పట్ల ఎంత బాధ్యతగా ఉంటుందో తెలియజెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Prabhunath Singh: జంట హత్యల కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
ఈ వీడియోను డిప్యూటి కలెక్టర్ సంజయ్ కుమార్ ట్విటర్ లో షేర్ చేశారు. ఏం క్యాప్షన్ పెట్టాలో కూడా మాటలు రావడం లేదు అంటూ ఆయన ఈ వీడియోను తన ఎక్స్ ( ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఓ తల్లి కుటుంబ పోషణ కోసం రోడ్డు పక్కన ఒక బండి పెట్టుకొని పండ్లు, పూలు అమ్ముతూ ఉంటుంది. కొంచెం కెమెరా పక్కకు తెస్తే ఆమె తన పిల్లలకు రోడ్డు పక్కనే బల్లపై పండ్లు అమ్ముకుంటూనే చదువు చెబుతుంది. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ అంటే అంతే ఎక్కడ ఉన్న తన బాధ్యత మర్చిపోదు అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అమ్మా నీకు వందనం పిల్లలను తల్లి కంటే బాగా ఎవరు చూసుకోగలరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా చూడగా, వేల మంది లైక్ చేశారు. వీడియో చూసిన చాలా మంది ఆ తల్లిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
आज कैप्शन के लिये मेरे पास शब्द ही नहीं हैं..!!
💕#मां #Respectfully 🙏 pic.twitter.com/8A3WEFmAMg— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 29, 2023