Site icon NTV Telugu

Hyderabad: లవర్‌తో కలిసి తల్లిని చంపిన ప్రియురాలు.. తప్పేం లేదన్న ప్రియుడి తల్లి..

Jeedimetla

Jeedimetla

హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రేమికుడు శివ, అతని తమ్ముడు కలిసి దారుణంగా తల్లి అంజలిని హత్య చేసిన ఘటన ఒక్కసారికి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ రోజు ఆమె మృతదేహాన్ని సూరారంలోని డా.బీఆర్ అంబేద్కర్ భవన్‌కు తరలించారు. తెలంగాణ సాంస్కృతి సారధి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మృతదేహాన్ని మహబూబాబాద్ తరలించారు. అయితే.. ఈ దారుణ ఘటనపై నిందితుడి తల్లి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

READ MORE: China: 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రేస్.. ఎలా బయటపడిందంటే..?

శివ తల్లి సంతోషి మాట్లాడుతూ.. “మ్యాటర్ అంతా అమ్మాయి దగ్గరే ఉంది. అమ్మాయి బయటపడితే అసలు విషయం తెలుస్తోంది. అంజలిని చంపడం నా వరకు కరెక్టే.. మేము తప్పు చేయలేదు.. తప్పంతా ఆ అమ్మాయిది. నాకేం టెన్షన్ లేదు ఈరోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను తీసుకొచ్చుకుంటా. అంజలిని చంపడం తప్పు కాదు. ఆమె మా ఇంటి మీదికి రావడం, మాపై కేసు పెట్టడం తప్పు. ఆమెను చావగొట్టడం కరెక్ట్, ఆమె చావడమే కరెక్ట్. మేము పోలీస్ స్టేషన్ లో తప్పు ఒప్పుకొని.. మా బాబును మా ఇంటికి తీసుకొచ్చాం. ఆ అమ్మాయి బయటికి ఎందుకు ఎలా వచ్చింది. అమ్మాయి నా కొడుకును పిలిచిందా లేదా నాకు తెలియదు.” అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

READ MORE: Gold Bangles for Amaravati: రాజధాని నిర్మాణానికి బంగారు గాజుల విరాళం..

Exit mobile version