Illicit Relationship : బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతని భార్య డ్రైవర్‌తో కలిసి పారిపోయింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తాను రోజంతా గ్యారేజీలో పని చేసేవాడిని. ఈలోగా ఇద్దరు కలిసిపోయారు. ఆమె ముగ్గురు పిల్లలను వదిలి పారిపోయిందని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన భార్య చాలా సార్లు డ్రైవర్‌తో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించిందని… అప్పటికే డ్రైవర్‌పై తనకు అనుమానం వచ్చిందని బాధితుడు పేర్కొన్నాడు. దీంతో డ్రైవర్‌ను కొట్టి తరిమాడని బాధితుడు వాపోయాడు. డ్రైవర్‌ను కొట్టడంతో విషయం సద్దుమణిగిందని తాను భావించానన్నాడు. కానీ తన భార్య ఇంత పని చేస్తదని ఊహించలేదన్నాడు. ఆమె ఇలా చేయడంతో అతను షాక్ అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతని భార్య పారిపోయిందని ఎవరికీ తెలియదు. భార్య వద్ద మూడు వేర్వేరు ఖరీదైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
Read Also: Tension in Osmania university: ఓయూలో ఉద్రిక్తత.. జేఏసీ నాయకుల అరెస్ట్
కిడ్నాప్ జరగలేదు
ఈ ఘటన తర్వాత డ్రైవర్, సదరు మహిళ తమ ఇష్టానుసారం పారిపోయారని ఫోన్‌లో తెలిపారు. తనను కిడ్నాప్ చేయలేదు. భర్త వేధింపులతో విసిగిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయానని మహిళ పేర్కొంది. పైగా ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకోనని… ఆ బాధ్యత భర్తదే అవుతుందని కూడా తెలిపింది. తన ప్రేమికుడితో చనిపోవడానికైనా సిద్ధమని, కానీ తన భర్తతో కలిసి జీవించనని చెప్పింది.
Read Also: Amritpal Singh: మహిళలతో అక్రమ సంబంధాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్ లీలలు..
ఈ మేరకు బన్మఖి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నాం. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి వరుణ్ ఝా తెలిపారు. కాగా, ఈ ఘటనతో పూర్ణియా ప్రజలు షాక్‌కు గురయ్యారు.