Site icon NTV Telugu

Maharashtra Crime: ప్రియుడు కోసం ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..

Maharastra

Maharastra

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న కొడుకు, కూతురును కడతేర్చింది ఓ తల్లి. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలు అడ్డుకుంటున్నారని.. ఈ క్రమంలో 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడును కొట్టి చంపింది. ఈ ఘటన రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగింది. కాగా.. ఈ ఘటనపై నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో పెళ్లి చేసుకుందామని, పిల్లలు అడ్డుకుంటున్నారని యువతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు.

Read Also: Rahul Gandhi: ‘అబద్ధాల మూటతో చరిత్ర మారదు’.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు

వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో అనుమానాస్పద స్థితిలో 5 ఏళ్ల అమాయక బాలిక, మూడేళ్ల బాలుడు మృతి చెందడంపై స్థానిక క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. రాయ్‌ఘర్ పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మార్చి 31న కిహిమ్ అనే గ్రామంలో పిల్లలు అపస్మారక స్థితిలో కనిపించారు. ఆ తర్వాత వారిని అలీబాగ్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అక్కడ వారు చనిపోయినట్లు ప్రకటించారని పేర్కొన్నారు.

Read Also: Health Tips : రాత్రి పడుకోనే ముందు ఒక గ్లాసు తాగితే చాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..

దీంతో.. ఇద్దరి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. కాగా.. పిల్లల హత్యల వెనుక నిందితురాలు తల్లి శీతల్ పోల్ పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యవత్‌మాల్‌ జిల్లా పుసాద్‌కు చెందిన శీతల్‌ పోల్‌ పెళ్లికి ముందు తనకు తెలిసిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో.. శీతల్ పోల్ తన భర్తతో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version