Site icon NTV Telugu

Tragedy: దారుణం.. పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన తల్లి

Infant

Infant

Mother dumped infant into drain:  కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను పుట్టగానే చెత్త కుప్ప లేదా మురికి కాలువ పాలు చేస్తూ కనికరం లేకుండా ప్రవర్తిస్తు్న్నారు. పురిటి నొప్పులు పడి కని కూడా కసాయిలా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా పొత్తిళ్లలో ఉంచి కాపాడుకోవాల్సిన పసికందులను పొదల్లో పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటనే చిత్తూరులో జరిగింది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి.

Also Read: Rayachoti Student Died In Ukraine: ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించిన విద్యార్థి

వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి వచ్చి చూసిన స్థానికులు మురికి కాలువలో పసిగుడ్డును చూసి ఆశ్చర్యపోయారు. మురికి కాలువలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును బయటకు తీశారు అక్కడి స్థానికులు. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పసిపాప పరిస్థితి చూసి అక్కడి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చిన్నారిని పలమనేరు ఆసుపత్రి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు కొందరు యువకులు. అయితే పాపను ఎవరు పడేశారు, ఎందుకు పడేశారు అనే విషయాలు తెలియరాలేదు. ఆడపిల్ల కావడం వల్ల వదిలించుకోవడానికి పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసలు విచారిస్తున్నారు. పాప పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Exit mobile version