NTV Telugu Site icon

Hyderabad: మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్.. వీవీఐపీల పేరుతో మోసాలు

Criminal Arrest

Criminal Arrest

హైదరాబాద్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్‌ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్‌ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్‌ కారు, క్రికెట్‌ బ్యాట్, ఐరన్ రాడ్‌, 25 హాకీ స్టిక్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ మాజీ మంత్రి అన్న కొడుకును హనీట్రాప్‌లోకి దించాడు క్రిమినల్ బుర్హానుద్దీన్.. ఆ తర్వాత అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.25 లక్షలు వసూలు చేశాడు కేటుగాడు. అంతేకాకుండా… రాహుల్‌ గాంధీ పీఏ నంటూ అప్పటి జార్ఖండ్‌ సీఎంకు ఫోన్ చేశాడు.. మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ అప్పటి జార్ఖండ్‌ సీఎంకు ఫోన్లో హుకుం జారీ చేశాడు. అయితే.. అప్పటి జార్ఖండ్ సీఎం ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోనే నిందితుడిపై 11 కేసులు, ఇతర రాష్ట్రాల్లో మరో 4 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని బ్లాక్‌మెయిల్ చేశాడు క్రిమినల్ బుర్హానుద్దీన్.. ఈడీ కేసు నుండి తప్పిస్తానంటూ ఓ ఐఏఎస్ అధికారి నుండి కోటిన్నర వసూలు చేశాడు.

Read Also: Turkey: టర్కీలో ఘోర అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

కాగా.. ఈ ఘరానా కంత్రీగాడీని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వీవీఐపీల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు సయ్యద్ బురానుద్దీన్.. రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్‌ఘడ్‌లో మోసాలకు పాల్పడ్డాడు. ఏకంగా ఛత్తీస్‌ఘడ్ సీఎం కార్యాలయం సిబ్బందికే కుచ్చుటోపీ వేసేందుకు ప్రయత్నించాడు. మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. ఛత్తీస్‌ఘడ్ క్యాడర్ కి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని మోసం చేశాడు. పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్‌ను నమ్మించాడు మోసగాడు.. ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సీబీఐ ఎంక్వయిరీని రద్దు చేయిస్తానంటూ కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయాడు ఈ జాదుగాడు.. అంతేకాకుండా.. హైదరాబాదులో ఓ బిజినెస్‌మెన్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని మోసం చేశాడు. నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించాడు కేటుగాడు.. అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మరోవైపు.. మొయినాబాద్‌లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో అతనిపై కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: Salary Accounts: శాలరీ అకౌంట్ ఉందా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!