Site icon NTV Telugu

Ind Vs WI: విండీస్ పై ప్రస్తుత తరం టీమిండియా ప్లేయర్ అత్యధిక టెస్టు సెంచరీలు.. ఎవరో తెలుసా.. ?

Team India

Team India

దశాబ్దకాలంగా భారత జట్టు ప్రధాన ఆటగాళ్లుగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ కొనసాగుతూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగులుస్తూ సంచలన రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ కెరీర్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకుని కోహ్లి అందనంత ఎత్తులో నిలిచాడు.. 43 సెంచరీలు బాదిన రోహిత్‌ సైతం తన ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించాడు.

Read Also: Lose Eyesight: కంటి చూపు కోల్పోయిన 18 మంది.. ప్రభుత్వాసుపత్రిలో సర్జరీనే కారణమని ఆరోపణ..

అయితే, వెస్టిండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో మాత్రం వీరిద్దరిలో ఎవరూ కూడా టాప్‌లో లేకపోవడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా విండీస్‌తో తమ తొలి సిరీస్‌ ఆడుతుంది. ఈ క్రమంలో డొమినికా వేదికగా ఇవాళ్టి (బుధవారం) నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023లో తమ స్థాయికి తగ్గట్లు కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి రాణించలేక పోయారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

ఇక, వీరిద్దరు విండీస్‌తో జరిగే టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ.. విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ వెస్టిండీస్ జట్టుపై ఎన్ని సెంచరీలు చేశారో తెలుసా..? విండీస్‌పై కోహ్లీ ఇప్పటి వరకు 14 టెస్టులాడి కేవలం రెండు సెంచరీలు, 5 హాఫ్ అర్థ శతకాలు బాదగా.. ఇక, రోహిత్ శర్మ 4 మ్యాచ్‌లలో రోహిత్‌ రెండు సెంచరీలు కొట్టాడు. ఇక వెస్టిండీస్ పై నాలుగు చేసి విరాట్, రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నది.. టీమిండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. 11 మ్యాచ్‌లలో అశ్విన్ 50.18 సగటుతో 552 పరుగులు చేశాడు. తద్వారా యాక్టివ్‌ క్రికెటర్లలో స్టార్‌ బ్యాటర్లైన కోహ్లి, రోహిత్‌లను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

Exit mobile version