IPL 2026 Trades: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్‌ను అంతలా అభిమానిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న IPL 2026 వేలానికి ముందు టోర్నీలోని జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఐపీఎల్‌కు సంబంధించి సంజు శాంసన్, రవీంద్ర జడేజా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ IPL ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే చారిత్రాత్మక ట్రేడ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి కావచ్చని అంటున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను నేరుగా మార్పిడి చేసుకుంటారని, వారి ఒక్కొక్కరి విలువ రూ.18 కోట్లు. అయితే ఇప్పటి వరకు IPLలో జరిగిన ఐదు అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
MI – RCB మధ్య బిగ్ డీల్..
అత్యంత ఖరీదైన జాబితాలో మొదటి పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్. 2023 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఈ ఆస్ట్రేలియన్ స్టార్‌ను రూ.17.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ తదుపరి సీజన్ ఐపీఎల్ 2024 కి ముందు.. ముంబై ఇండియన్స్ గ్రీన్‌ను మార్పిడి చేసుకుంది. వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ స్టార్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.
హార్దిక్ కోసం భారీ మొత్తంలో ఖర్చు..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ట్రేడ్‌ల జాబితాలో హార్దిక్ పాండ్యా పేరు ప్రత్యేకమైంది. ఈ స్టార్ ప్లేయర్ ముంబై ఇండియన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు, తర్వాత రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్ తరుఫున మైదానంలోకి అడుగుపెట్టాడు, తర్వాత IPL 2024లో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ ట్రేడ్ విలువ రూ.15 కోట్లు అని సమాచారం. దీనిని విజయవంతం చేయడానికి MI గ్రీన్‌ను ట్రేడ్ చేసిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
* మూడో స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ తన ఐపీఎల్ కెరీర్‌లో వివిధ జట్లకు ఆడాడు. ఈ అనుభవజ్ఞుడైన భారత ఆల్ రౌండర్‌ను IPL 2023 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అమ్మింది. దీని విలువ మొత్తం రూ.10.75 కోట్లు.
* ఈ జాబితాలో నాల్గవ పేరు న్యూజిలాండ్‌కు చెందిన విధ్వంసక బౌలర్ లాకీ ఫెర్గూసన్. ఈ స్టార్ ప్లేయర్ IPL 2023 కి ముందు కూడా ట్రేడ్ చేయబడ్డాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో ఉన్న ఫెర్గూసన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.
* భారత యువ పేసర్ అవేష్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 2024 IPL సీజన్ కోసం ఈ ప్లేయర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అవేష్ ఖాన్ ధర రూ.10 కోట్లు.
READ ALSO: Bike Rider Protection Jacket: బైక్ రైడర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు.. ధర ఎంత అంటే?
