KCR Condoles Harinatha Rao : ముఖ్యమంత్రి కేసీఆర్ తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామైన పాకాల హరినాథరావు మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్లి హరినాథరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మహముద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
Read Also: Russia – Ukraine War: 120క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథ్‌రావు(72) గురువారం గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఆయన భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం హరినాథ్‌రావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. మరికాసేపట్లో హరినాథ్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.