Site icon NTV Telugu

North Korea: వీధుల్లోకి లక్షలాది మంది కొరియన్లు.. అమెరికాను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్‌ను నాశనం చేసినందుకు “ప్రతీకార యుద్ధం” అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలు మార్చ్‌ను చేపట్టారని ఆ దేశ మీడియా నివేదించింది.

Also Read: Kissing Street: ఆ గల్లీకి వెళ్తే ముద్దులే ముద్దులు.. ఈ కిస్సింగ్ స్ట్రీట్‌ ఎక్కడో తెలుసా..?

ప్యోంగ్యాంగ్‌లో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలకు 1,20,000 మందికి పైగా హాజరయ్యారని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ర్యాలీలో ఉత్తర కొరియన్లు “యుఎస్ ప్రధాన భూభాగం మొత్తం మా షూటింగ్ రేంజ్‌లో ఉంది”, “సామ్రాజ్యవాద అమెరికా శాంతి విధ్వంసకం” అని రాసి ఉన్న బోర్డులను పట్టుకుని ర్యాలీల్లో పాల్గొన్నారు.

1950-53 సంఘర్షణ ఉత్తర కొరియా ఆకస్మిక దాడితో ప్రారంభమైంది. ప్యోంగ్యాంగ్‌లో సమావేశమైన నిరసనకారులు తమ ప్రభుత్వ సంఘటనలను ప్రచారం చేస్తూ యునైటెడ్ స్టేట్స్ యుద్ధాన్ని, కొరియా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

Exit mobile version