Site icon NTV Telugu

Moosi River: భారీవర్షాలు.. మూసీ నది ఉగ్రరూపం

Water (1)

Water (1)

గత 15 రోజులుగా నగరం ముసురు పట్టింది. మధ్యలో కొన్ని గంటలు మాత్రమే సూరీడు కనిపిస్తున్నాడు. నగరం, శివారు ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీని పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ, ఈసీ నదులు వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా పూడూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో మూసీకి భారీ వరద వస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ పరిధిలో కురిసిన భారీ వర్షంతో ఇటు ఈసీకి కూడా వరద పోటెత్తుతున్నది. ఈ క్రమంలో నగర శివారులోని జంట జలాశయాలకు వరద అంతకంతకూ పెరిగింది. దీంతో జలమండలి అధికారులు క్రమంగా గేట్లను ఎత్తుతూ మూసీలోకి జలాలను వదులుతున్నారు.

నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. భారీవర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు మూసీ నదిలో భారీగా నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న చాదర్‌ఘాట్, శంకర్ నగర్, కమల్ నగర్, మూసా నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్లన్నీ అందులో మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోపల ఉన్నారు మరియు టెర్రస్‌పై ఉండటంతో వారు బయటకు రాలేకపోతున్నారు.

]

ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీమా లింగం కత్వా వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది మూసీ నది. బొల్లేపల్లి – సంగెం రోడ్డు లెవల్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహిస్తున్న మూసి మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల కారణంగా వికారాబాద్‌ జిల్లాలో విద్యాసంస్థలు అన్నింటికీ కలెక్టర్‌ నిఖిల బుధవారం సెలవు ప్రకటించారు. అధికారులు గండిపేట్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇదిలా వుంటే జంట జలాశయాల‌ నుండి మళ్ళీ పెరిగిన వరద ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మంచిరేవుల గ్రామానికి పూర్తిగా నిలిచిపోయాయి రాకపోకలు. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న మూసి నది తీవ్రతతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు దారులు మూత పడడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. నార్సింగీ రావాలంటే 7 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి. మంచిరేవుల బ్రిడ్జ్, నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు, రాయల్ ఫంక్షన్ హాల్ నుండి భారీ గా ప్రవహిస్తుంది వరద నీరు.గండిపేట సమీపంలో మూసి లో చిక్కుకుంది ఓ కుటుంబం. తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు. వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం చీకటి పడడంతో ముందుకు వెళ్లలేకపోయారు సిబ్బంది.గండిపేట సిగ్నేచర్ విల్లా సమీపంలో ఘటన. ఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ డిసిపి.వారిని రక్షించడానికి రంగంలోకి దిగాయి రెస్క్యూ టీం బృందాలు. చివరకు ఆ కుటుంబాన్ని రక్షించాయి.

నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 8 క్రస్టు గేట్లను 4 అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ఇన్ ఫ్లో : 5702 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో : 16,950 క్యూసెక్కులుగా వుంది. పూర్తి స్థాయి సామర్థ్యం : 645 అడుగులుగా వుంది. ప్రస్తుత సామర్థ్యం : 637 అడుగులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 2.7 టీఎంసీలుగా వుంది.

IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి..!!

Exit mobile version