మనం నిత్యం వాడే కూరగాయాలలో ఒకటి టమోటా.. ఇటీవల 200 పైగా పలికిన సంగతి తెలిసిందే..మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు..సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్థానంలో టమాటా ఉంది. మన దేశ కూరగాయల బాస్కెట్ లో టమాటా ఉత్పత్తి శాతం 10.7%. మన రాష్ట్రంలో సుమారు 25591 హెక్టార్లలో టమాటా సాగు చేస్తూ 0.88 మిలియన్ హెక్టార్ల టమాటా ఉత్పత్తి చేస్తున్నారు..
ఒక్కోసారి ధరలు ఆకాశాన్ని అంటుతాయి.. ఈ పంటకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. దాంతో ఈ పంటను ఏడాది పొడవునా పండిస్తున్నారు.. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతంను తట్టుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో కురుస్తున్న అధిక వర్షాల వలన మొక్క ఎదుగుదల క్షీణించడం మరియు పూత, పిందే రాలిపోవడం వలన దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు.. అందుకే ఈ పంటను వేస్తున్న రైతులు తగిన మెళకువలు పాటించినచో టమాటా లో నాణ్యమైన అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు..
ఈ పంటకు అన్ని రకాల నేలల్లో సాగుకు అనుకూలం. ఇసుకతో కూడిన నేలల నుండి బరువైన బంక నేలల్లో కూడా పంటను సాగు చేయవచ్చు. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది.. జూన్ నుంచి జూలై వరకు ఈ పంటను వేసుకోవచ్చు..
టమోటాలో అర్క మేఘాలి, పూసా ఎర్లీ ద్వార్ఫ్, అలాగే వానాకాలంలో ఆలస్యంగా వేసుకోవడానికి పూసా రూబీ, అర్క వికాస్ రకాలు అనుకూలం.. విత్తనాలు వేసే ముందు విత్తన శుద్ధి చెయ్యడం మంచిది.. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు నారును పెంచేందుకు ట్రేలను వాడుతున్నారు. వీటిని ప్రోట్రేలు అంటారు. ఈ ట్రే లలో కోకోపీట్ లేదా వర్మి కంపోస్ట్‌ను నింపి నారు పెంచుతారు. నారుమడి దశలో వచ్చే నారుకుళ్ళు తెగులు నివారణకు 1 టన్ను కోకోపీట్ కు 100 కిలోల వేప పిండి, 1 కిలో ట్రైకోడెర్మ విరిడి కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి..
ఇకపోతే నీరు ఎక్కువగా ఉంటే టమోటా సైజు కూడా పెరుగుతుంది.. అంటే మొక్కలను నాటిన తర్వాత నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 7`10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. పూత, పిందె మరియు కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి.. జీవ ఎరువులు ఇవ్వడం ముఖ్యం.. ఎంతవరకు రసాయన ఎరువులను తగ్గించడం మేలని నిపుణులు చెబుతున్నారు.. కలుపు నివారణ, తెగుళ్లు వస్తే వాటిని నివారిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మంచి దిగుబడిని పొందవచ్చు..