NTV Telugu Site icon

Viral Video: అబ్బా.. తమ్ముడు.. ఇక కుమ్ముడే.. వీడియో చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..

Monkey

Monkey

ఐస్ క్రీమ్ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరతాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు.. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి.. అనారోగ్య సమస్యలు, ఇంకేదైనా ఉందంటే కాసేపు వాటిని పక్కన పెట్టి ఒక్కటే కదా ఏం కాదు అంటూ లాగించేస్తారు.. మనుషులే కాదండోయ్ కోతులు కూడా కూడా ఐస్ క్రీం కనిపిస్తే చాలు ఇలానే పార్టీ చేసుకుంటాయి.. ఏంటి.. నిజమా అనే సందేహం వస్తుంది కదూ.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం..

ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఐస్‌క్రీమ్‌ని చూసిన కోతులు దాని కోసం ఎలా ఎగబడుతున్నాయో.. చూస్తుండగానే మొత్తం ఊడ్చేశాయి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. కోతుల గుంపు చల్లని ఐస్‌క్రీమ్‌పై కన్నేసింది. ఐస్‌ క్రీం తినేందుకు అవి ఎగబడుతున్నాయి. ఐస్‌ క్రీం బండి కనిపించగానే..అటు వైపు పరిగెత్తి తనకిష్టమైన ఐస్ క్రీం తీసుకుని తినడం మొదలు పెట్టాయి. అక్కడ బండిలో చాలా ఐస్ క్రీంలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కోతుల గుంపు ఐస్‌క్రీమ్ తినేందుకు ఎగబడుతుండటంతో వాటిని ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. దాంతో అవన్నీ ఫ్రీగానే చల్లని వేడుకను చేసుకున్నాయి..

కోతులు చేస్తున్న ఐస్‌ క్రీం పార్టీని చూసిన చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక వినియోగదారు.. పార్టీని ఎలా ఆస్వాదించాలో వాటికి బాగా తెలుసునని అంటుంటే.. మరో వినియోగదారులు..ఈ కోతులకు పళ్ళ సమస్యలు, జలుబులు లేవనుకుంటా అందుకే కుమ్మేసాయి అంటూ ఫన్నీగా కామెంట్ల వర్షం కురిపించారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్ వేసుకోండి..