Site icon NTV Telugu

Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!

Monkey Viral Video

Monkey Viral Video

Monkey Beer Viral Video: ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడం, మనుషులతో సరదాగా ఆడుకోవడంకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు కోతులు చేసిన విచిత్రమైన పని చూసి.. అందరూ అవాక్కవుతున్నారు. ఓ కోతి డస్ట్ బిన్‌ నుండి బీర్ బాటిల్‌ను తీసి.. అందులోని ఆల్కహాల్‌ చుక్కలను గటగటా తాగేసింది.

బ్రెజిల్‌లోని పరానా స్టేట్‌లోని ఒక పార్కులో రెండు కోతులు డస్ట్ బిన్‌పై కూర్చుకుని.. సరదాగా ఆడుకుంటున్నాయి. అందులో ఒక దానికి బిన్‌లో బీర్ బాటిల్‌ కనిపించగా.. దాన్ని బయటికి తీసింది. బిన్‌పై కూర్చుని ఎంచక్కా.. బాటిల్‌లోని మిగిలిన ఆల్కహాల్‌ను తాగేసింది. కోతి బీర్ తాగడంను గమనించిన ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీశాడు. దాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కోతి బీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మామ ఏక్ పెగ్ లా, ఈ కోతి రూటే సపరేటు గురూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Viral Video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్‌ ట్యాంక్! అదృష్టం అంటే ఇదేమరి

ఇలాంటి ఘటనే ఒకటి గతంలో భారత్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని ఓ మద్యం దుకాణంలోకి కోతి ప్రవేశించి.. బీరు తాగుతూ కెమెరాకు చిక్కింది. బాటిల్‌లోని బీర్ మొత్తంను చుక్క కూడా వదలకుండా తాగేసింది. ఈ వీడియో అప్పట్లో హైలెట్ అయింది. అయితే కోతులు మానవ ఆహారం, పానీయాలు తీసుకోవడం వాటి ఆరోగ్యానికి హానికరం అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. మద్యం లాంటి ఉత్పత్తులు పడేయొద్దని జనాలను అధికారులు కోరారు.

Exit mobile version