ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు.
Jalebi Baba: 100 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబా జైలులో మృతి..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరుకులెత్తుస్తున్నారు. మండలంలోని చందాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొండితోక జగన్ మోహన్ రావుకు బ్రహ్మరథం పట్టారు. వాహనం పై ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను మరల గెలిపించండి అంటూ మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Gujarat: ఓటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు
మరోవైపు.. మొండితోక జగన్ మోహన్ రావుకు మద్ధతుగా మొండితోక శశికళ ప్రచారంలో పాల్గొన్నారు. కంచికచర్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ భార్య మొండితోక శశికళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన బావ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావుకు ఓటు వేయాలని మొండితోక శశికళ కోరారు. గడప గడపకు తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో జగన్ మోహన్ రావును గెలిపించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.