Site icon NTV Telugu

Viral Video: ఈ తల్లి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏం చేసిందో చూడండి..!

Desi Jugad

Desi Jugad

చిన్న పిల్లలు తరచుగా చాలా అల్లరి అల్లరి చేస్తుంటారు. కొద్దిసేపు వారిని చూడకుండ ఉంటే.. రచ్చరంబోలా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పనులతో పాటు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచడం, వాటిని నిర్వహించడం అంత తేలికైన పని కాదు. కానీ ఓ తల్లి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తల్లి వంటగదిలో పని చేస్తుండగా.. పాపను కంటికి రెప్పలా చూసుకోవడానికి స్వచ్ఛమైన దేశీ జుగాడ్‌ను ఉపయోగించింది.

పని చేస్తూ పిల్లలను చూడడటమంటే పెద్ద సవాలే.. అయితే దానిని ఎదుర్కోవటానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఆ మహిళ తన నడుముకు చున్నీ కట్టి, మరొకటి పాప నడుము కట్టింది. అంతేకాకుండా.. చలి నేల నుంచి బిడ్డను రక్షించేందుకు ఆ మహిళ వంటగదిలో చాప కూడా పరిచింది. ఆ అమ్మాయి చాప మీద ఆనందంగా ఆడుకుంటూ మోకాళ్ల మీద నడుస్తూ కనిపిస్తుంది. చాలా క్యూట్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని కూడా తన తల్లి సరిగ్గా కూర్చోబెట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ప్రజలు కూడా చాలా కామెంట్లు చేస్తున్నారు.

Read Also: CM Jagan New Year Wishes: తెలుగు వారందరికీ సీఎం జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Read Also: TikTok: పాకిస్తాన్‌లో టిక్ టాక్ వివాదం.. సోదరిని కాల్చి చంపిన 14 ఏళ్ల బాలిక..

ఈ వీడియోపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మహిళ చేసిన ఈ జుగాద్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. పలువురు విమర్శిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు తమ చిన్నతనంలో తమ చుట్టూ తిరగలేని విధంగా ఇలా చేశారని రాశారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ కావడంతో ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని కొంత మంది అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆ మహిళ తర్వాత బిడ్డను బేబీ సేఫ్టీ చైర్‌పై ఉంచిన మరో వీడియోను షేర్ చేసింది. దేశీ జుగాడ్ అప్‌గ్రేడ్ చేయబడిందని తెలిపింది.

Exit mobile version