Balayya : శ్రీలీల తో జంటగా నటిస్తానంటే.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ తిట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఆసక్తి రేపుతోంది. నేడు వరంగల్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో బాలయ్య ఎప్పటిలాగే ఎంతో ఎనెర్జిటిక్ గా ప్రసంగించారు. వరంగల్ చరిత్ర గురించి మాట్లాడుతూ తన స్పీచ్ ను ప్రారంభించారు.
తాను తొలిసారి తెలంగాణ యాసలో నటించిన చిత్రం భగవంత్ కేసరి అని బాలయ్య తెలిపారు. వీరసింహారెడ్డి తర్వాత ఎలాంటి చిత్రం చేయాలని అనుకుంటుండగా.నాకు సరైన చిత్రం దొరికింది. ఈ చిత్రం నా అభిమానులకు విందు భోజనంలా ఉంటుంది అని బాలయ్య అన్నారు. మీరు ట్రైలర్ లో చూసింది కొంచెమే.. చిత్రంలో ఇంకా చాలా దాచిపెట్టాం అని బాలయ్య అన్నారు. దసరాకి ముందు తప్పకుండా దంచుదాం అని బాలయ్య తెలిపారు.. నేను అనిల్ రావిపూడి సెట్స్ లో ఎంతో సరదాగా వున్నాము.. ఆయన నాతో కాస్త భయపడ్డారు. నెక్స్ట్ అనిల్ రావిపూడితో కామెడీ మూవీ చేస్తా. నేను కామెడీలో కూడా కింగ్ ని. అనసూయమ్మ గారి అల్లుడు, మంగమ్మ గారి మనవడు లాంటి చిత్రాలు చేశాను అని బాలయ్య సరదాగా చెప్పారు. ఇక కాజల్, శ్రీలీల నటనని బాలయ్య ప్రశంసించారు.ఆయితే శ్రీలీలతో తన తరువాత సినిమాలో ఆమె హీరోయిన్ గా, నేను హీరోగా చేయాలని ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.. కానీ ఈ విషయం ఇంట్లో చెబితే మోక్షజ్ఞ నన్ను తిట్టాడు. ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా అని తిడుతున్నాడు అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు అందరికి తెగ నవ్వులు పూయించాయి.
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!