Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలాకాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. “ఇప్పుడే వస్తున్నాడు… త్వరలోనే పరిచయం” అంటూ గత కొంత కాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా.. అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కన్పడ్డంలేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ.. ఏదీ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవడం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది.
Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు..
ప్రారంభంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతాడని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా చకచకా జరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా రద్దయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 99 మ్యాక్స్’లో మోక్షజ్ఞ లీడ్ రోల్‌లో కనిపిస్తాడని బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
సాధారణంగా సినీ వారసులు 25 ఏళ్ల వయసులోనే తెరంగేటం చేస్తుంటారు. కానీ, మోక్షజ్ఞ ఇప్పటికే ఆ వయసును దాటి చాలాకాలం గడిచినా ఇంకా కెమెరా ముందుకు రాకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా ప్రాజెక్టులు వర్కవుట్ కాకపోవడం, బడ్జెట్ సమస్యలు, సరైన దర్శకుడు దొరకకపోవడం వంటి కారణాలు ఈ ఆలస్యానికి కారణాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా మోక్షజ్ఞ స్వయంగా ‘ఆదిత్య 369’ సీక్వెల్‌లో నటిస్తున్నానని చెప్పడంతో మరోసారి నమ్మకం ఏర్పడింది.
అయితే ఆ కథను బాలయ్య రాసినప్పటికీ.. దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవడం, భారీ బడ్జెట్ అవసరం కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా రిస్క్‌గా మారినట్టు సమాచారం. సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కాల్సిన ‘ఆదిత్య 999 మ్యాక్స్’కు భారీ పెట్టుబడి అవసరం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
