NTV Telugu Site icon

Raj Pakala: రాజ్‌ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు

Raj Pakala

Raj Pakala

Raj Pakala: జన్వాడ్ ఫాంహౌస్‌ పార్టీకి సంబంధించి రాజ్‌ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ 35(3) సెక్షన్‌ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరుకాకుంటే బీఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని నోటీసులో వెల్లడించారు. రాజ్ పాకాలకు మోకిలా ఇన్‌స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు. రాజ్ పాకాల ఇంటి గోడకి నోటీసును అతికించారు. ఇదిలా ఉండగా.. హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనని అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Janwada Farm House Case: నేడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించనున్న పోలీసులు

 

Show comments