Site icon NTV Telugu

Mokila Land Auction: రేపటితో ముగియనున్న మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ

Mokila Land

Mokila Land

రేపటితో (మంగళవారం) మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ ముగియనుంది. ఇక, మోకిల గ్రామంలోని హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గవ రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్ లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70వేల నుంచి రూ.1,05, 000ల వరకు రేట్లు రావడం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్-2 లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్టీసీ వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: Rajasthan: బూండీలో విద్యుత్ సెగ.. బీజేపీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జి

నేటి (సోమవారం) ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడవరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు.ఇక, రేపటితో ఈ ప్లాట్ల వేలం ముగియనుండటంతో ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. రేపు ఈ-వేలంలో మరింత మంది పోటీ పడే అవకాశం ఉంది. మిగిలిన 60 ప్లాట్లకు భారీ మొత్తంలో రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలియజేస్తున్నారు.

Read Also: Chandra shekhar: నేను అమిత్ షాకి శాలువా కప్పితే దళితుడ్ని అంటూ నిరాకరించాడు..

Exit mobile version