Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి రెండు భాగాలు భాషా తో సంబందం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ (Drishyam 3) విషయంలో చిత్ర బృందం అనుసరిస్తున్న వ్యూహం మాత్రం అత్యంత విచిత్రంగా ఉంది.
నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల (Geopolitical Tensions) కారణంగా సినిమాను మే 21కి వాయిదా వేశారు. అయితే విడుదల తేదీకి కేవలం నాలుగు వారాల సమయం మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, మేకర్స్ మే 21నే రాబోతున్నామని మౌనంగా స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా భారీ చిత్రాలకు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ ‘దృశ్యం 3’ టీమ్ మాత్రం దీనికి భిన్నంగా వెళ్తోంది. కానీ కేవలం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌పైనే ఆధారపడటం వల్ల బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని సస్పెన్స్‌ను కాపాడటం కోసమే మేకర్స్ ఇలా కంటెంట్‌ను బయటపెట్టడం లేదా? లేక ఇది ఒక రకమైన వినూత్న ప్రచార శైలా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
ఇక గతంలో లాగా అన్ని భాషల్లో ఒకేసారి కాకుండా, ఈసారి కేవలం మలయాళంలోనే సినిమాను విడుదల చేస్తున్నారు. మరి తెలుగు (వెంకటేష్), హిందీ (అజయ్ దేవగన్) రీమేక్ వెర్షన్లు ఎప్పుడు వస్తాయి? అసలు అవి ఇప్పుడే మొదలవుతాయా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. మోహన్‌లాల్ (జార్జ్ కుట్టి), మీనా, అన్సిబా హసన్ మరియు ఎస్తేర్ అనిల్ మళ్లీ తమ పాత పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషన్స్ లేకుండా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి గర్జన చేస్తుందో చూడాలి. ఒకవేళ ఈ వ్యూహం వర్కవుట్ అయితే, భవిష్యత్తులో మిగిలిన దర్శకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!