Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: ‘ది ప్యారడైజ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న చిత్ర బృందం ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి పాల్గొన్న ప్రత్యేక చిట్‌చాట్‌లో మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు తనను ఎలా ఒప్పించాడు, సెట్లో ఏం జరిగిందనే విషయాలను మోహన్ బాబు సరదాగా బయటపెట్టారు. సాధారణంగా పెద్ద నటులను కథలోకి తీసుకురావాలంటే దర్శకులు అనేక రకాల నరేషన్లతో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల ఏకంగా కలెక్షన్ కింగ్‌కే సినిమాటిక్ స్కెచ్ వేశారన్న విషయం బయటపడింది.
ఈ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్రకు జోడీగా భార్య పాత్ర ఉంటుందని, అందుకోసం ప్రత్యేకంగా ఒక హీరోయిన్ను ఎంపిక చేస్తున్నామని డైరెక్టర్ నమ్మబలికినట్లు చెప్పారు. పాత తరం హీరోయిన్లు కాకుండా సరికొత్త కాంబినేషన్ కోసం ఆఫీసుకు అమ్మాయిలను పిలిపించి ఆడిషన్స్ కూడా నిర్వహించినట్లు చెప్పారన్నారు. ఇదంతా నిజమేనని నమ్మి నేను సెట్స్ పైకి వచ్చి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసేశానన్నారు. ఫస్ట్ షెడ్యూల్ ముగియగానే.. “ఇంతకీ నా పక్కన నటించే హీరోయిన్ ఎక్కడ?” అని నేరుగా డైరెక్టర్ని అడిగినట్లు మోహన్ బాబు చెప్పారు. అప్పుడే అసలు నిజం తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “సినిమాలో ఆ క్యారెక్టరే అవసరం లేదని తీసేశాం సార్” అంటూ చేతులెత్తేసినట్లు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులను లొకేషన్‌కి రప్పించడానికి కథలో మార్పుల పేరుతో ఇలాంటి ప్లాన్లు వేయడం ఇండస్ట్రీలో కనిపిస్తుంటుంది కానీ, ఏకంగా ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న లెజెండరీ నటుడికే దర్శకుడు ఇలా హ్యాండ్ ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. నాని సమక్షంలోనే మోహన్ బాబు ఈ విషయాన్ని నేరుగా బయటపెట్టడంతో, పక్కనే ఉన్న శ్రీకాంత్ ఓదెల నవ్వుతూ తప్పించుకోలేకపోయారు. సినిమా మేకింగ్ వెనుక నడిచిన ఈ కథా నాటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా చక్కర్లు కొడుతోంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!