Mohammed Siraj: ఇంగ్లాండ్‌తో ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సత్తా చాటాడు. మ్యాచ్ చివరి రోజున సిరాజ్ వేసిన మ్యాజికల్ స్పెల్ భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధిస్తున్న ఇంగ్లండ్ ఒక దశలో హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో సునాయాస గెలుపు దిశగా పయనిస్తోంది అనిపించింది. కానీ, సిరాజ్ ఊహించని విధంగా పుంజుకుని చివరి రోజు తన ఐదు వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పాడు.
ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, గెలుపు కోసం కేవలం 35 పరుగుల దూరంలో మాత్రమే నిలిచింది. ఇలాంటి సమయంలో సిరాజ్ మూడు కీలక వికెట్లు తీయగా, మరోకటి ప్రసిద్ధ్ కృష్ణ తీసి ఇంగ్లండ్‌ను 367 పరుగులకే మట్టి కరిపించారు. ఈ మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ టెస్ట్‌లో మాత్రమే కాదు, సిరీస్ మొత్తం మీద కూడా సిరాజ్ తన బౌలింగ్ స్టామినా ఏంటో నిరూపించాడు. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా సిరాజ్ కావడం విశేషం.
Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుందని ఊహించారా..?
ఈ టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ధసెంచరీతో పోరాడాడు. ఆ ఇన్నింగ్స్‌లో గస్ అట్కిన్సన్ 5 వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) ఆకట్టుకున్నారు. భారత బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసారు. ఆ తర్వాత భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసింది. యశస్వి జైస్వాల్ (118), ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ధసెంచరీలతో జట్టు స్కోరును నిలబెట్టారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో జోష్ టంగ్ మరోసారి 5 వికెట్లు తీశాడు.
ఈ ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఉత్కంఠగా సాగింది. ఇంగ్లండ్ మొదటి (లీడ్స్), మూడవ (లార్డ్స్) టెస్టులు గెలవగా, భారత్ రెండవ (బర్మింగ్‌హామ్), ఐదవ (ది ఓవల్) టెస్టుల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ డ్రా కావడంతో, సిరీస్‌ను 2–2తో టై చేసింది భారత జట్టు. చివరి విజయంలో మహ్మద్ సిరాజ్ అసలైన హీరోగా నిలిచాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!
For his relentless bowling display and scalping nine wickets, Mohd. Siraj bags the Player of the Match award in the 5th Test 👏👏
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficial pic.twitter.com/GyUl6dZWWp
— BCCI (@BCCI) August 4, 2025