Mohammed Shami Suicide: 19వ అంతస్తు నుంచి దూకి.. షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు!
- 2018లో షమీ కెరీర్‌లో పెను తుపాన్
- షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు
- 19వ అంతస్తు బాల్కనీలో నిల్చుని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umesh Kumar Revelas Mohammed Shami’s Suicide Incident: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జీవితంలో 2018లో పెను తుపానే వచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. కొద్ది రోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీ బయటపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని అతడు ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని షమీ స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పాడు.
ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ… ‘2018లో మహమ్మద్ షమీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో మా ఇంట్లోనే ఉన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఎంతో కుమిలిపోయాడు. నేను అన్నింటినీ సహించగలను కానీ నా దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను మాత్రం సహించలేనని షమీ నాతో అన్నాడు. దాంతో ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని నాకు అర్ధమైంది. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మంచి నీళ్లు తాగడానికి గదిలోంచి బయటకు రాగా.. 19వ అంతస్తులో ఉన్న మా ఇంటి బాల్కనీలో ఉన్నాడు. ఏం జాఱఁగఁగఁబోతుందో నాకు అర్థమైంది. వెంటనే లోపలికి తీసుకెళ్లా. ఆ రాత్రిని మరచిపోలేము’ తెలిపాడు.
Also Read
- YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
- Mandadi Review: మండాడి రివ్యూ..
Also Read: Bigg Boss-Amrutha Pranay: బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్!
‘ఆ ఘటన తర్వాత మేం మాట్లాడుకుంటున్నప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుంచి మహమ్మద్ షమీకి క్లీన్ చిట్ మెసేజ్ వచ్చింది. ఆ రోజు చాలా ఆనందపడ్డారు. ప్రపంచకప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషించాడు. అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టాడు’ అని ఉమేశ్ కుమార్ చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ అదరగొట్టిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ అనంతరం చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అతడు ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న షమీ.. పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?