Site icon NTV Telugu

Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు

Shami

Shami

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రత్యర్థి జట్లకు తన మెరుపు బౌలింగ్ తో చెమటలు పట్టిస్తుంటాడు. కీలక మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు షమీ ఎంపిక కాలేదు. కానీ, అక్టోబర్ 15న ప్రారంభమయ్యే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్ కోసం బెంగాల్ జట్టులో షమీని తీసుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షమీ టీమిండియా సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దని ఫైర్ అయ్యారు.

Also Read:Supreme Court : మిస్సింగ్ పిల్లల కోసం ప్రత్యేక చర్యలు అవసరం

ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టి20 జట్ల నుంచి తొలగించిన తర్వాత, షమీ తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, ఏ ఫార్మాట్‌లోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. జట్టు యాజమాన్యం తన ఫిట్‌నెస్ గురించి తనతో చర్చించలేదని షమీ చెప్పాడు. నాలుగు రోజుల రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడగలిగితే, తాను 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు, షమీని తప్పించడానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వేరే కారణం చెప్పారు.

Also Read:E20 Petrol: E20 పెట్రోల్‌ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!

గత కొన్ని సంవత్సరాలుగా షమీ పెద్దగా క్రికెట్ ఆడలేదని, ఎంపిక కోసం క్రమం తప్పకుండా మ్యాచ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని అగార్కర్ అన్నారు. షమీ చివరిసారిగా 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ తరపున ఆడాడు. అతను ఆ టోర్నమెంట్‌ను బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు పడగొట్టడంతో ప్రారంభించాడు, కానీ రెండు మ్యాచ్‌ల్లో వికెట్ తీసుకోలేదు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు, ఫైనల్‌లో ఒక వికెట్ పడగొట్టాడు.

Exit mobile version