Mohammed Shami: ప్రపంచకప్ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami React on ODI World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్ షాక్ నుంచి తేరుకోలేదన్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. తుది మెట్టుపై బోల్తా పడడంతో భారత్ ఫాన్స్ సహా ఆటగాళ్లు ఏడ్చేశారు.
తాజాగా మహమ్మద్ షమీ ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత దేశమంతా ఓటమితో తీవ్ర నిరుత్సాహానికి గురైంది. అభిమానులు మాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. మేం కూడా కప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. వందశాతం శ్రమించి.. ఫైనల్‌కు చేరాం. విశ్వ విజేతగా నిలవాలని కలలుగన్నాం. కానీ మా అంచనాలు తారుమారయ్యాయి. జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఫైనల్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ ఫైనల్ షాక్ నుంచి తేరుకోలేదు’ అని బుధవారం ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ చెప్పాడు. చీలమండ గాయం కారణంగా షమీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
Also Read: IND vs SA: భారత జట్టు నిజంగా అతన్ని మిస్సవుతోంది.. అద్భుతాలు చేసేవాడు!
‘ఫైనల్‌లో ఓటమి తర్వాత అందరూ మైదానం నుంచి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం. ఎవరం మాట్లాడుకోలేదు. డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రెండు నెలల పాటు చేసిన శ్రమ వృధా కావడంతో నిరుత్సాహం చెందాం. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చారు. ఎవరా అని అందరం తలెత్తి చూశాం. ప్రధానిని చూసి షాక్ అయ్యాము. ఎందుకంటే.. ప్రధాని వస్తున్నారనే సమాచారం మాకు లేదు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాతనే మేమంతా ఒకరితో మరొకరు మాట్లాడుకున్నాం’ అని మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచకప్ 2023లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!