Site icon NTV Telugu

సెలెక్టర్ల నిర్ణయంపై Mohammed Shami అసంతృప్తి.. ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పండి అంటూ?

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ కు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ అవుతాడనుకొన్న ఈ సీనియర్ పేసర్ కు నిరాశ తప్పలేదు. టి20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పూర్తిగా యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది.

Kalki 2 Update: ప్రభాస్ ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. ‘కల్కి 2’ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా?

ఈ ఏడాది ప్రారంభంలో టీం ఇండియా తరపున టి20 మ్యాచ్ ఆడిన షమి ఐపీఎల్ లో విఫలం కావడంతో ఆసియా కప్ రేస్ లో వెనుకపడ్డాడు. పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ తనను సెలెక్ట్ చేయలేదని షమి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలెక్టర్లపై పరోక్షంగా ప్రశ్నిస్తూ.. తన నిరాశను వ్యక్తం చేశాడు. ఆసియా కప్ కు ఎంపిక కాని షమీ తనను ఎందుకు ఎంపిక చేయలేదో సెలెక్టర్లను వివరణ అడిగాడు.

ఈ విషయమై షమీ మాట్లాడుతూ.. ఆసియా కప్ కోసం ఎంపిక చేయనందుకు నేను ఎవరిని నిందించను. ఎవరిపైనా ఫిర్యాదు చేయను. నేను జట్టుకు సరైన వాడినైతే నన్ను ఎంపిక చేసుకోండి. కాకపోతే, నాకు ఎటువంటి సమస్యలు లేవు. టీమిండియాకు ఏది ఉత్తమమో అది చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. నాకు అవకాశం లభిస్తే నా శక్తి మెరకు నేను నావంతు కృషి చేస్తాను. నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దులీప్ ట్రోఫీ ఆడగలిగితే టి20 క్రికెట్ ఎందుకు ఆడలేనని చెప్పుకొచ్చాడు.

Ghati : మొత్తానికి ‘ఘాటి’ ప్రమోషన్ పై స్పందించిన అనుష్క.. వీడియో వైరల్

ఇదివరకు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రా లేకపోవడంతో షమీని ఎంపిక చేశారు. ఆ టోర్నీలో ఐదు మ్యాచుల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి పర్వాలేదు అనిపించాడు షమీ. అయితే వన్ డే ఫార్మట్ కావడం బుమ్రా కూడా లేకపోవడంతో షమికి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం20 ఫార్మాట్ లో షమిని నమ్ముకునే పరిస్థితిలో బీసీసీఐ లేనట్టుగా తెలుస్తుంది. అతని ఫిట్నెస్ తో పాటు వయసును బట్టి ఫార్మాట్ కు సహకరించడం కష్టం అని భావించినట్లైంది.

Exit mobile version