NTV Telugu Site icon

Mohammed Shami: ప్రపంచ రికార్డుకు దగ్గరలో టీమిండియా స్టార్ బౌలర్..

Mohammed Shami 750 Kg

Mohammed Shami 750 Kg

ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. చివరి టీ20లో మూడు వికెట్లు పడగొట్టి ఫాంలోకి వచ్చిన షమీ.. ఇప్పుడు వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టాడు.

Read Also: Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..

నిజానికి.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అయితే, నాగ్‌పూర్‌లో జరిగే వన్డే మ్యాచ్‌లో మహ్మద్ షమీ 5 వికెట్లు తీస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. మహ్మద్ షమీ తన సత్తా చాటితే.. 101 ఇన్నింగ్స్‌లలో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. రాబోయే రెండు మ్యాచ్‌లలో అయినా ఐదు వికెట్లు తీస్తే, మ్యాచ్‌ల పరంగా మిచెల్ స్టార్క్ కంటే వెనుకబడి ఉంటాడు.. కానీ ఇన్నింగ్స్ పరంగా మిచెల్ స్టార్క్‌ను సమం చేస్తాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో మహ్మద్ షమీ తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.

Read Also: Tamil Nadu: “స్కంధమలై”ని “సికిందర్ మలై”గా మార్చాలి.. కుమారస్వామి ఆలయంపై వివాదం..

ఇప్పటివరకు ఆడిన 101 వన్డే మ్యాచ్‌ల్లో మహ్మద్ షమీ 195 వికెట్లు పడగొట్టాడు. ఐదు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు నాగ్‌పూర్‌లో ఆరోసారి ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. తన పేరు మీద ప్రపంచ రికార్డును లిఖించుకోనున్నాడు. ఏదేమైనా.. షమీ టీమిండియా తరపున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. షమీ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు.