NTV Telugu Site icon

Mohammad Siraj Got Angry: మరీ అంత కోపమెందుకు సిరాజ్.. లబుషేన్‌కి ఇచ్చిపడేశాడుగా

Siraj

Siraj

Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్‌ – గవాస్కర్‌ సిరీస్‌ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చివరివరకు వచ్చిన తర్వాత ఓ అభిమానిని చూసిన మార్నస్ లబుషేన్‌ అకస్మాత్తుగా క్రీజు నుంచి వైదొలిగాడు. మార్నస్ దూరంగా వెళ్లినప్పటికీ, సిరాజ్ బంతిని అతని వైపుకు కోపంగా విసిరాడు. అయితే ఇందుకు కారణం, ఒక అభిమాని నిజానికి లబుషేన్‌ కు ఎదురుగా ఒక పైపును మోస్తు వెళ్ళాడు. దీంతో అతను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాతి బంతికి మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని లబుషేన్‌ ఫోర్ కొట్టాడు.

Also Read: Masood Azhar: పాక్‌లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..

తొలి రోజు ఆట ముగిసే సమయానికి మెక్‌స్వీనీ 97 బంతుల్లో 38 పరుగులు చేసి క్రీజులో ఉండగా, లబుషేన్‌ 67 బంతుల్లో 20 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రారంభంలోనే తొలి వికెట్ కోల్పోయిన తర్వాత, లబుషేన్‌, మెక్‌స్వీనీలు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వికెట్ తీసుకోవడానికి భారత బౌలర్లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజు మొత్తం ఆట గురించి మాట్లాడితే ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు పై చేయి సాధించింది. ప్రతి సెషన్‌లోనూ వారు మంచి ప్రదర్శన చేసారు. ఇక ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 48 పరుగులకే 6 వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అతనికిది 15వ ఐదు వికెట్లు. దీంతో శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న రెండో డే-నైట్ టెస్టు తొలి రోజు టీ సమయానికి ఆస్ట్రేలియా భారత్‌ను 44.1 ఓవర్లలో కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టార్క్ భారత్‌పై తొలిసారి 5 వికెట్లు తీశాడు.

Also Read: Nitish Kumar Reddy: అబ్బా.. అలా ఎలా రివర్స్ స్కూప్ షాట్ కొట్టావు నితీష్ (వీడియో)

Show comments