Mohammad Hafeez Picks 6 wickets in Zim Afro T10 2023: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన బౌలింగ్ చేశాడు. టీ10 క్రికెట్‌లో ఏకంగా 6 వికెట్స్ పడగొట్టి.. పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. హఫీజ్ తన కోటా 2 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్స్ తీశాడు. 12 బంతుల్లో 11 డాట్ బాల్స్ కావడం ఇక్కడ విశేషం. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో హఫీజ్ ఈ గణాంకాలు నమోదు చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్‌లో కూడా 5 కంటే ఎక్కువ వికెట్స్ తీయడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో టీ10 క్రికెట్‌లో 6 వికెట్స్ పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం (జులై 21) బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ బౌలర్ మహ్మద్ హఫీజ్ 2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్, మొయిడిన్ ఓవర్ ఉంది. హఫీజ్ 12 బంతులు వేసి ఒకే ఒక బౌండరీ ఇచ్చాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్‌లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. హఫీజ్‌కు సంబందించిన ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 402 మ్యాచ్‌లు ఆడాడు. 250కి పైగా వికెట్లు తీసినప్పటికీ.. ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయలేదు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు. 55 టెస్టులో 53 వికెట్స్.. 218 వన్డేల్లో 139 వికెట్స్.. 119 టీ20ల్లో 61 వికెట్స్ పడగొట్టాడు. ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అయిన మహ్మద్ హఫీజ్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కాబోతున్నట్లు సమాచారం.
https://twitter.com/SharyOfficial/status/1682473621338431488?s=20