NTV Telugu Site icon

Mohammad Hafeez: టీమ్‌ను AI సెలక్ట్ చేసింది.. పాక్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

Mohammad Hafeez

Mohammad Hafeez

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. దుబాయ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాకిస్తాన్ జట్టు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 45 బంతులు, 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ (111 బంతుల్లో 100 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ తరఫున సౌద్ షకీల్ (76 బంతుల్లో 62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46) నిలకడగా బ్యాటింగ్ చేశాడు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన ఇమామ్-ఉల్-హక్ 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు.

Read Also: Toxic: రాకింగ్ స్టార్.. మళ్ళీ షేక్ చేసే ప్లాన్!!

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు పరుగులు, వికెట్ల కోసం చెమటోడ్చారు. అయినప్పటికీ విజయం సాధించలేదు. ఓటమి అనంతరం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ‘గేమ్ ఆన్ హై’ షోలో హఫీజ్ మాట్లాడుతూ.. ” పాకిస్తాన్ జట్టును AI ద్వారా ఎంపిక చేశారు. తమ వద్ద ఒక గణాంక నిపుణుడు ఉన్నారని, జట్టును ఎలా తయారు చేయాలో వారికి తెలుసని చెప్పారు. ముందు AIలో మీ పేరు ఉందో లేదో సెర్చ్ చేసుకోండి” అని పీసీబీపై విమర్శలు గుప్పించాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాటింగ్ ఆర్డర్‌లో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా.. 3 నుండి 5 నంబర్‌లలో ఉండాలని చెప్పాడు. “నేను చాలా ఆలోచించాను.. జట్టును ఎంపిక చేసిన స్థాయికి నా మనస్సు చేరుకోలేకపోయింది” అని హఫీజ్ అన్నాడు.

Read Also: Nani : ఏవండోయ్ నాని గారు… ఏంటిది?