Site icon NTV Telugu

Mowgli Movie : మోగ్లీ వచ్చేస్తున్నాడు.. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్

Mowgli

Mowgli

మొత్తానికి యంగ్ హీరో రోషన్ కనకాల రెండో సినిమా ‘మోగ్లీ’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 13న విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ముఖ్యంగా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కథలోని లోతును చూపించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13కి వాయిదా పడింది. అయితే, డిసెంబర్ 12 నుంచి ప్రీమియర్లు మొదలుకానున్నాయి.

Also Read: Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !

విడుదల తేదీ పోస్టర్‌లో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ సంతోషంగా కనిపిస్తుండగా, బండి సరోజ్ కుమార్ మాత్రం సీరియస్‌గా కనిపించాడు. ఈ కథ ప్రధానంగా ఈ మూడు పాత్రల మధ్య తిరుగుతుందని తెలుస్తోంది. ఈ ముగ్గురిని ఆధునిక రామాయణంలోని రాముడు, సీత, రావణుడిలా పోరాడుతున్న పాత్రలుగా చిత్రీకరించినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రోషన్ కనకాల పూర్తిగా మేక్‌ఓవర్ అయ్యారు. ఇది హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ తో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ డ్రామాగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.ఇక హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించగా, రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version