NTV Telugu Site icon

MODI: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పోస్టుకు స్పందించిన మోడీ..ఏం సమాధానమిచ్చారంటే..

New Project (35)

New Project (35)

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ఎన్నికల విజయంపై, ఆయన చేస్తున్న మంచి పనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మమ్మల్ని కలిపే వివిధ సమస్యలపై సహకారాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై ప్రధాని మోడీ స్పందిస్తూ, ‘మీ శుభాకాంక్షలకు ప్రధాని జార్జియా మెలోనికి ధన్యవాదాలు. భాగస్వామ్య విలువలు, ఆసక్తులపై ఆధారపడిన భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం.” అని సమాధానమిచ్చారు.

READ MORE: America: భారత్ లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు..

కాగా.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. మాల్దీవులు ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు ఎక్స్‌లో ఖాతాలో. “2024 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, BJP, NDAకి అభినందనలు. రెండు దేశాల భాగస్వామ్య శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను.” అని రాసుకొచ్చారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్‌గే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు ప్రధాని మోడీకి, ఎన్డీయేకు అభినందనలు అని పేర్కొన్నారు.