Bihar Elections: మన దేశంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రంగాలు ఏంటో తెలుసా.. క్రీడలు, సినిమా, రాజకీయాలు. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే క్రికెట్‌లో రోహిత్ – కోహ్లీ జంట తెలియని వారంటూ ఉండరు. వీళ్లు మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు విజయం చాలా దూరంలో ఉన్నట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి జోడీనే బీహార్ ఎన్నికల్లో మ్యాజిక్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జోడీ ఎవరిదో తెలుసా.. బీహార్ సీఎం నితీష్ కుమార్- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. బీహార్ పొలిటికల్ పిచ్‌పై ఈ ఇద్దరూ రాజకీయ క్రీడాకారులు నిర్మించిన అద్భుతమైన ఇన్సింగ్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఎవరూ ఊహించని ఫలితాలను సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎన్డీఏకు 200 కంటే ఎక్కువ సీట్ల ఆధిక్యం వైపుగా దూసుకుపోతుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో మహా కూటమి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు వరకు తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఏమైనా అద్భుతాలను సృష్టించగలరా అనే విషయంపై రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ – జేడీయూ అనుసరించిన ఎన్నికల వ్యూహం అద్భుతాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ – నితీష్ ప్రశాంతమైన ప్రవర్తనతో, పూర్తి నియంత్రణతో ఈ ఎన్నికల సమరంలో టీమిండియాకు క్రికెట్‌లో పెట్టని కోట లాంటి రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలా మారి వారివారి పార్టీలకు విజయాన్ని అందించారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
రోహిత్-విరాట్‌లతో పోలిక ఎందుకంటే..
బీహార్ ఎన్నికలకు రోహిత్ – విరాట్‌లకు పోలిక ఎందుకంటే.. ఇటీవల క్రికెట్‌లో ఏం జరిగిందో బీహార్ రాజకీయాల్లో అదే పునరావృతమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చాలా మంది విమర్శించడం మొదలు పెట్టారు. ఇక ఈ ఇద్దరి కెరీర్ చివరి దశలో ఉందని కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్లిద్దరూ తమలో ఇంకా ఆటతీరు తగ్గలేదని ఆస్ట్రేలియాలో చూపించాడు. అచ్చం అలాగే నరేంద్ర మోడీ – నితీష్ కుమార్‌లను ఇద్దరినీ కూడా ఎన్నికల ముందు తక్కువ అంచనా వేశారు. కానీ ఎన్నికల పిచ్‌లో వారు ప్రతి బంతిని చదివి తమకు పూర్తి అనుకూలమైన షాట్‌లను విజయవంతం బౌండరీ లైన్‌లను దాటించి, ఈ ఎన్నికల్లో మరపురాని విజయాన్ని అందుకున్నారు.
స్పష్టంగా మారిన చిత్రం..
వాస్తవానికి నవంబర్ 14న ఉదయం అంతా బీహార్ ఎన్నికల ట్రెండ్ అప్‌డేట్‌లు ఉత్కంఠను కొనసాగించాయి. కానీ మధ్యాహ్నం నాటికి వాటి చిత్రం మరింత స్పష్టంగా మారింది. NDA రికార్డు స్థాయిలో ఆధిక్యాన్ని పొందుతోంది. BJP కి ఈ విజయం కేవలం సీట్ల గురించి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఆ పార్టీ పట్టును సూచిస్తున్నాయి, అలాగే JDU సంస్థాగత, సూక్ష్మ నిర్వహణ శక్తిని నిరూపించాయి. వాస్తవానికి గొప్ప రోడ్ షోలతో మహా ఘట్‌బంధన్ ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే NDA వ్యూహం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. సూక్ష్మ స్థాయిలో NDA తన పని పూర్తి చేసింది, అలాగే ఈ కూటమికి బూత్ నిర్వహణ బలంగా ఉంది. ఈ కూటమి విజయానికి మహిళా ఓటర్లపై పెట్టిన ప్రత్యేక దృష్టి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కేంద్ర – రాష్ట్ర పథకాల ప్రభావం ప్రతి గ్రామంలోనూ కనిపించింది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి EBC, OBC, SC, ST వర్గాలలో గణనీయమైన ఓట్లు కలిసి వచ్చాయి. అలాగే JDU పార్టీకి మహిళల ఓట్లు అధికారాన్ని నిలబెట్టడానికి సహాయం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. నరేంద్ర మోడీ తన ప్రసంగాలలో మహిళల ఓటును నిరంతరం కేంద్రీకరించారు. రాష్ట్రంలో మహాఘట్‌బంధన్ ఓటమికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో గాలి తమకు అనుకూలంగా ఉందని భావించి క్షేత్రస్థాయిలో పార్టీ వర్గాలను బలోపేతం చేయడంలో విఫలమయ్యాయి అని చెబుతున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ దృశ్యానికి PK నమూనా సరిపోలలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తేజస్వి యాదవ్ కూడా యువత నుంచి విస్తృత మద్దతు లభిస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ ఈసారి రాష్ట్రంలో యువ ఓటర్ల తీర్పు వారికి పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో మోడీ- నితీష్ కూటమికి విజయం వరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: IND vs SA Test: ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే?
