PM Modi: ప్రధాని మోడీకి ట్రంప్ ఆహ్వానం.. కీలక సమావేశానికి హాజరు కావాలని లేఖ..

Trumpmodi

Trumpmodi

PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. ఈ సమావేశంలో గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడం, మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారా లేదా అనేది ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఇంకా ధృవీకరించలేదు.

READ MORE: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్..

×
×
Ad

ఈజిప్టు ప్రెసిడెన్సీ అధికారిక ప్రకటన ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ట్రంప్, సీసీ సంయుక్త అధ్యక్షతన జరిగే సమావేశానికి 20కి పైగా దేశాల నాయకులు పాల్గొంటున్నాయి. “గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో భద్రత కోసం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యమని ప్రకటన పేర్కొంది.

READ MORE: India-Afganisthan Ties : తాలిబాన్లతో భారత్ దోస్తీ ఏంటి..? ఆఫ్ఘనిస్తాన్‌లో నూతన వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి ?