PM Kisan Tractor Yojana: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందజేస్తుంది. చాలా సార్లు ప్రజలు సోషల్ మీడియా నుండి ప్రభుత్వ వివిధ పథకాల గురించి సమాచారాన్ని పొందుతారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ని ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుపై ప్రభుత్వం సబ్సిడీని అందజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిజంగానే ఇలాంటి పథకాన్ని ప్రారంభించిందా.. దానితో రైతులకు ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం..
రైతులను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ ట్రాక్టర్ పథకాన్ని ప్రారంభించిందని సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుపై సబ్సిడీ ఇస్తామని వ్యవసాయ శాఖ చెప్పినట్లు వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి ఈ పథకంపై చర్చలు మొదలయ్యాయి. దీనితో పాటుగా కేటుగాళ్లు ఓ వెబ్ సైట్ లింక్ పంపుతున్నారు. అందులో వారు లాగిన్ చేసి పథకం ప్రయోజనాలను పొందాలని కోరారు. ఇప్పుడు పీఐబీ ఈ వైరల్ క్లెయిమ్ నిజాన్ని కనుగొంది.
Read Also:Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చాలని కేంద్రానికి వినతి
పీఐబీ వాస్తవానికి ఈ పథకాన్ని తనిఖీ చేసింది. దాని అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో మెసేజ్ షేర్ చేసింది. ఇందులో పథకం నిజం గురించి సమాచారం ఇవ్వబడింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పేరుతో ఎటువంటి సబ్సిడీ పథకాన్ని ప్రారంభించలేదు. సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తామని క్లెయిమ్ చేస్తున్న ఈ వెబ్‌సైట్ నకిలీదని తేలిపోయింది.
ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి
భారతదేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన కేసులు వేగంగా పెరిగాయి. చాలా మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక నకిలీ ప్రభుత్వ పథకాలతో ఆకర్షిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి బ్యాంకింగ్ మోసానికి పాల్పడుతున్నారు. అంతే కాకుండా వివిధ పథకాల పేరుతో డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకం క్లెయిమ్‌లను విశ్వసించే ముందు, ఒకసారి ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించి పథకం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
Read Also:Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…