LPG Subsidy: ఇంధన ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ సిలిండర్లు జనాలకు గుదిబండగా మారుతున్న తరుణంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇస్తున్న సబ్సీడీని మరో ఏడాది పొడగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌పీజీ సబ్సిడీపై వినియోగదారుల మదిలో అనేక సందేహాలు ఉన్నాయి. కొన్నిసార్లు రాయితీ లభిస్తుంది.. మరి కొన్నిసార్లు రాకపోవడంతో ధరల విషయంలో వారికి క్లారిటీ లేదు. ఈ సందర్భంలోనే LPG ధర పెరుగుదల కారణంగా, సాధారణ వినియోగదారులు దాని భారాన్ని భరించాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని పొడగించాలని అనుకుంటుందంట కేంద్ర ప్రభుత్వం.
Read Also: Advocate Rayin : న్యాయంగా ఈ న్యాయవాదిది మంచి మనసు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీని మరో ఏడాది పొడిగించే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 1 మే 2016న ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. పొగ వల్ల కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌లను అందించాలని యోచించింది. మహిళలు కూడా దీనిని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో చాలా మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సిలిండర్‌కు సబ్సిడీ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీకి సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద ఎల్‌పిజి సిలిండర్‌పై సంవత్సరానికి 12 సిలిండర్లకు రూ.200 సబ్సిడీని మరో ఏడాది పొడిగించవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం 100 Haq LPG కవరేజీని పొందడమే. మే 2021లో, 2023 ఆర్థిక సంవత్సరానికి 90 మిలియన్ల ఉజ్వల యోజన లబ్ధిదారులకు సంవత్సరానికి 12 సిలిండర్లకు రూ. 200 సబ్సిడీని కేంద్రం ఆమోదించింది. ఇది కాకుండా, రూ. 1,600 విలువైన ఎల్‌పిజి సిలిండర్‌లను ఉచితంగా అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తుంది. తక్కువ ఆదాయ కుటుంబాల మహిళలకు ఈ పథకం కింద రీఫిల్, ఉచిత గ్యాస్ స్టవ్‌లు అందజేసింది కేంద్రప్రభుత్వం.
Read Also: New Type Helmet: కొడుకుల కోసం కొత్త హెల్మెట్ తయారు చేసిన తల్లి
ఇదిలావుండగా.. ఈ సంవత్సరం మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్ కావడంతో ఉజ్వల లబ్ధిదారులు ఈ పథకాన్ని 2024 ఆర్థిక సంవత్సరానికి పునరుద్ధరిస్తారా అని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను కేంద్రం విస్తరించడానికి మరొక కారణం ఏమిటంటే, మేఘాలయలో అతి తక్కువ LPG కవరేజీ(54.9 శాతం) ఉంది, తర్వాత త్రిపుర, జార్ఖండ్, గుజరాత్ ఉన్నాయి.