NTV Telugu Site icon

PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకి మోడీ అభినందనలు..

Modi

Modi

అనేక రోజుల రాజకీయ గందరగోళం తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహమ్మద్ యూనస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా పౌరులందరికీ భద్రత కల్పించాలని కోరారు.

READ MORE: Mahesh bday special: కోట్ల హృదయాల ‘గుండె చప్పుడు’ ఘట్టమనేని మహేష్ బాబు

ప్రధాని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాశారు, ‘కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌కు నా శుభాకాంక్షలు. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు భరోసానిస్తూ.. సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము ఎదురుచూస్తున్నాము. శాంతి, భద్రత, అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రజల భాగస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చడానికి బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది.” అని రాసుకొచ్చారు.

READ MORE: Warangal: వరంగల్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. సోషల్ మీడియాలో వైరల్..

రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ముహమ్మద్ యూనస్‌ను అభినందించారు. దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించడం ఈ సమయంలో అవసరమని అన్నారు. “బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్‌ ముహమ్మద్‌ యూనస్‌కు అభినందనలు. త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం అవసరం” అంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో రాహుల్‌ ఫొటో పోస్ట్‌ చేశారు.