Cabinet Expansion: బడ్జెట్‌కు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ!.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు నెలరోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుండడంతో ఈ మార్పులు బీజేపీ సంస్థను పునరుద్ధరించడంతో ముడిపడి ఉండవచ్చు. అంతేకాకుండా జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్లు కొందరు ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ నుంచి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని సమాచారం. వచ్చే ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశాలు ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు (మొత్తం 78 మంది) ప్రస్తుతం ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్న మంత్రుల్లో వారి పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రులను తొలగించవచ్చు. త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల, ప్రధాని మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 182 సీట్లకు గాను 155 స్థానాలను కైవసం చేసుకుంది. దాని మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Joshimath Land Subsidence: జోషీమఠ్‌లో 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు..
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలు బీజేపీకి ఎంతో కీలకం. మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి ఏడాది కాలం మినహా మిగిలిన కాలమంతా బీజేపీనే అధికారంలో ఉంది. అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని అక్కడ వేరొకరిని నియమించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను గెలుచుకునేందుకు ఆ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో పెద్దపీట వేయనున్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!