Site icon NTV Telugu

PM Modi: సుశీల్ మోడీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని

Mid

Mid

బీహార్‌లోని పాట్నాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నివాసానికి ప్రధాని వచ్చారు. ముందుగా సుశీల్ మోడీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: Anand Deverakonda: ఫ్యామిలీ స్టార్ నెగిటివిటీ ఆ గ్రూప్ పనే.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

ఇటీవలే దివంగత బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూశారు. కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. పలుమార్లు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. నితీష్‌కుమార్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పని చేశారు. రాజకీయాల్లో బహు అనుభవం కలిగిన నేతగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా సుశీల్ మోడీని నియమించారు. కానీ ఆయన అకాల మరణం పొందారు.

ఇది కూడా చదవండి: Schools Close: ఢిల్లీలో తీవ్ర ఎండలు.. నోయిడాలో పాఠశాలలు మూసివేత

ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ బీహార్‌లో రోడ్ షో  నిర్వహించారు. వాహనంలో నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చరు. ప్రధాని మోడీ వెంట రాష్ట్ర బీజేపీ నేతలు, జేడీయూ నేతలు ఉన్నారు. ఇక్కడ జేడీయూ, బీజేపీ ఉమ్మడిగా బరిలోకి దిగింది.

 

Exit mobile version