NTV Telugu Site icon

Modi-Kharge: ఈ సీన్ అదుర్స్.. మోడీకి షేక్‌ హ్యాండ్ ఇచ్చిన ఖర్గే.. నవ్వుతూ ముచ్చట్లు (వీడియో)

Modi Kharge

Modi Kharge

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ వీడియోలో.. ఖర్గే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలను ఈ వీడియోలో చూడవచ్చు. మహాపరినిర్వాన్ దివస్‌ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్త పరుస్తున్నారు.

READ MORE: Union Minister Suresh Gopi: కేంద్ర మంత్రి నోట తెలుగు పాట.. తెలుగు సినీ పరిశ్రమపై సురేష్‌ గోపీ ప్రశంసల వర్షం..

మహాపరినిర్వాన్ దివస్‌ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
‘బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్ధంతిని ఏటా ‘మహాపరినిర్వాన్ దివస్’గా జరుపుకుంటున్నాం. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారికతకు అంబేడ్కర్ చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, జాతీయోద్యంలో దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

READ MORE:OnePlus Community Sale 2024: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!

Show comments