NTV Telugu Site icon

Mobile Charging Tips: మొబైల్ బ్యాటరీ బాగుండాలంటే.. రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా?

Mobile Charging Tips

Mobile Charging Tips

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పుల ప్రభావం బ్యాటరీ మీద పడుతుంది. మొబైల్ బ్యాటరీ బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ త్వరగా అయిపోతుంటే.. చాలా చికాకుగా ఉంటుంది. అందుకే బ్యాటరీ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కొంతమంది బ్యాటరీ కొంచెం డిశ్చార్జ్ కాగానే.. వెంటనే ఛార్జింగ్‌ పెడుతుంటారు. ఛార్జింగ్ పెట్టిన కొద్ది సేపటికే.. తీసేసి ఫోన్‌ని యూస్ చేస్తుంటారు. మీకు ఈ అలవాటు ఉంటే.. మీ ఫోన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఫోన్‌ను రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాలని టెక్‌ నిపుణులు అంటున్నారు. రోజులో ఎక్కువసార్లు లేదా తరచుగా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ము తరచుగా ఛార్జ్ చేస్తుంటే.. బ్యాటరీ త్వరగా అయిపోతుందని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. బ్యాటరీ త్వరగా అయిపోయినపుడు మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఫోన్‌లో 20 శాతం ఛార్జ్ మిగిలి ఉండగానే.. ఛార్జ్ చేయాలి. 80 శాతం ఛార్జింగ్ అయిన వెంటనే తీసేయాలి. బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు చూడకూడదు. బ్యాటరీ 80 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జర్ తీయాలి. బ్యాటరీ 45 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెటుకోవచ్చు. 75 శాతంకి చేరుకోగానే ఛార్జింగ్‌ను తీసేయాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది.

Show comments