NTV Telugu Site icon

Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు

New Project

New Project

Manipur : మణిపూర్ రాష్ట్రంలో సీఎం పాల్గొనున్న కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. ఈ ఘటన గురువారం రాత్రి చురచాంద్‌పూర్ జిల్లాలోని న్యూ లంకాలో జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూర్చోవాల్సి ఉంది. గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. దాంతో పాటు అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడాదనికి రెడీగా ఉన్న ఓపెన్ జిమ్‌నూ ఆ మూక ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఆ మూకను చూసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి.

Read Also:RR vs CSK : చెన్నైపై రాజస్థాన్‌ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్‌.

సీఎం బీరెన్ సింగ్ న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఓపెన్ జిమ్‌ను శుక్రవారం ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్‌ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్‌తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్‌కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది. ముందుగా, ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్‌పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే మూక ఈ దాడికి పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.

Read Also:Off The Record: సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్సెస్‌ మంత్రి కుమారుడు..? బీఆర్‌ఎస్‌లో టిక్కెట్‌ పంచాయతీ..?